సలార్ టీజర్.. అతి దగ్గరలోనే..


ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సలార్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లను దాటుతుంది అని ఫాన్స్ అయితే ఎంతో నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. అందుకు కారణం ఆదిపురుష్. 

ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతోంది. అయితే జూన్ 16వ తేదీన ఆదిపురుష్ సినిమాతో పాటు సలార్ కు సంబంధించిన టీజర్ తో అసలైన ప్రమోషన్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మొదట థియేటర్స్ లోనే టీజర్ సందడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా ఆదిపురుష్ సినిమాకు కూడా కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. రెండు భాగాలుగా నిర్మిస్తున్నట్లుగా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ విషయంలో అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. టీజర్ సమయంలో ఆ విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కానుంది.

Post a Comment

Previous Post Next Post