లియో తెలుగు రైట్స్ ఎంతంటే..?


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమాపై అంచనాలు అయితే రోజు రోజుకు గట్టిగానే పెరుగుతున్నాయి. విక్రమ్ సినిమా తర్వాత దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరపైకి వస్తున్న ఈ సినిమా కేవలం కొన్ని గాసిప్స్ ద్వారానే మంచి బజ్ క్రియేట్ చేసుకుంటుంది. ఇక విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఒక పోస్టర్ కూడా బాగానే వైరల్ అవుతుంది. 

కానీ వేరే హీరో ఫ్యాన్స్ మాత్రం ఇది అసలు బాగాలేదు అని ట్రోల్ అయితే చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి క్రేజ్ అయితే ఏర్పడుతుంది. ఇక లోకేష్ కనకరాజ్ సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి చిత్ర నిర్మాత తెలుగు రైట్స్ ను భారీ ధరకు అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ నైజాం థియేట్రికల్ రైట్స్ ను 25 కోట్ల రేంజ్ లోనే కోట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ బడా నిర్మాతలు విజయ్ లియో కోసం బాగానే పోటీ పడుతున్నారు. కానీ ఆ రేంజ్ లో మాత్రం రేటు పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు. మరి లియో మేకర్స్ ఎలా బిజినెస్ చేస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post