ఆదిపురుష్.. ఇక 'బ్రో' నే కాపాడాలి?


ప్రభాస్ నటించిన ఆదిపరుష్ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ ధరకు కొనుగోలు చేసింది. సినిమాకు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా రిస్క్ చేసి మరి 150 కోట్లకు పైగానే ఖర్చు చేసి మరి తెలుగు హక్కులను కొనుగోలు చేశారు. 

అయితే ఇప్పుడు ఈ సినిమా భారీ స్థాయిలో నష్టపోవడంతో ఆ సంస్థ తదుపరి సినిమాలపై కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమా ద్వారా నష్టపోయిన బయ్యర్లకు తప్పని సరిగా ఏదో ఒక విధంగా ప్రొడక్షన్ హౌస్ అండగా ఉండాల్సిందే. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తదుపరి సినిమా 'బ్రో' బిజినెస్ విషయంలో ఎంతో కొంత తక్కువ ధరలకు సెటిల్ చేయాల్సి ఉంటుంది. 

ఆ సినిమా తప్పనిసరిగా సక్సెస్ అయితేనే ఆదిపురుష్ తో పోగొట్టుకున్నది కొంతైనా బయ్యర్లకు దక్కుతుంది. ఇక బ్రో కూడా ఫెయిల్ అయింది అంటే అది మొదటికే మోసం వస్తుంది. కానీ ఆ సినిమా కమర్షియల్ గా మంచి కలెక్షన్స్ అయితే అందుకునే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఆదిపురుష్ సినిమా వలన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గత ఏడాది సంపాదనపై గట్టి దెబ్బె కొట్టింది.

Post a Comment

Previous Post Next Post