ఇండియన్ బిగ్గెస్ట్ కాంబినేషన్ గా ఇప్పుడు ప్రాజెక్ట్ K పేరు చాలా ట్రెండ్ అవుతుంది. ఒకవైపు అమితాబచ్చన్ మరొకవైపు కమల్ హాసన్.. మేయిన్ స్టార్ హీరోగా ప్రభాస్.. ఇంతకంటే బెస్ట్ కాంబినేషన్ లో మరొక సినిమా ఉండదేమో అనిపిస్తుంది. ఫ్యాన్స్ తో పాటు చాలామంది సినీ ప్రముఖుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది.
సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా కోసం దాదాపు 550 నుంచి 600 కోట్ల రేంజ్ లో అయితే ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాల్లో అసలు కమల్ హాసన్ ఎందుకు తీసుకున్నారు? ఎవరి సలహా ఇచ్చారు? అనే వివరాల్లోకి వెళితే.. ముందుగా సినిమాలో ప్రభాస్ కంటే విలన్ బలంగా ఉంటేనే సినిమా రేంజ్ పెరుగుతుంది అనే పాయింట్ తోనే క్యారెక్టర్ కోసం వేట మొదలుపెట్టారు.
అయితే మొదట ఈ సినిమాకు స్క్రిప్ట్ దశ నుంచి మేకింగ్ దశ వరకు సంగీతం శ్రీనివాస సలహాదారుడుగా సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని వారాల అనంతరం ఆయన హెల్త్ కారణంగా వెనకడుగు వేశారు. అయితే ఆయన స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే విలన్ పాత్రకు కమల్ హాసన్ అయితే బెటర్ అని చెప్పారు. కానీ అశ్విని దత్ మళ్లీ బడ్జెట్ విషయంలో ఆలోచించి వెనుకడుగు వేశారు.

సంజయ్ దత్ పేరు కూడా చర్చల్లోకి వచ్చింది కానీ ఆల్రెడీ సంజయ్ దత్ మిగతా సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి రొటీన్ గానే ఉంటుంది అని అనుకున్నారు. ఇక ఫైనల్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ సంగీతం మొదటి సలహానే బెటర్ అని కమల్ హాసన్ వైపు తిరిగారు. ఇక అతని పాత్ర ఈ సినిమాలో ఒక ఎమోషనల్ కంటెంట్ తో పాటు ఊహించని విలనిజాన్ని చూపించే విధంగా ఉంటుందట. కంటెంట్ కు తగ్గట్టుగా ప్రభాస్ తో పోటీ పడే రోల్ అని తెలుస్తోంది. మరి వెండితెరపై ఫ్యాన్స్ కు ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి.
Follow
Post a Comment