మెగా హీరోల కారణంగా నాని వెనుకడుగు?


నాని దసరా సినిమాతో ఈ ఏడాది వంద కోట్లు అందుకున్న స్టార్ హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత నెక్స్ట్ కూడా అదే రేంజ్ లో చేస్తాడు అనుకుంటే అందుకు భిన్నంగా అతను ప్యూర్ ఫ్యామిలీ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని 30వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇంకా మొదలు కాలేదు. కానీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ అయితే పూర్తయింది.

ఇక ఆగస్టు నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాను డిసెంబర్ 21 క్రిస్మస్ టైమ్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మెగా హీరోల కారణంగా నాని వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21న వెంకటేష్ సైంధవ్ సినిమా విడుదల కాబోతోంది. ఇక దాదాపు సమయంలో పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న బ్రో సినిమా కూడా విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ రెండిటి క్లాష్ మధ్యలో నాని తన సినిమా సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాడు. పోటీ లేకుండా సోలోగానే రావాలని ఆలోచిస్తున్నాడు. ఒకవేళ బ్రో సినిమా వాయిదా పడితే మాత్రం అదే సమయానికి రావచ్చు.

Post a Comment

Previous Post Next Post