పుష్ప 2: సుక్కు దారుణమైన ఖర్చు!


పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఇటీవల మంచి స్పీడ్ అందుకుంది. గ్యాప్ లేకుండా దర్శకుడు సుకుమార్ కీలకమైన సీన్స్ ను ఫినిష్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సెకండ్ పార్ట్ లో అతి ముఖ్యమైన యాక్షన్స్ సీన్స్ కోసం మాత్రం అసలు కాంప్రమైజ్ అవడం లేదట. ఈ సినిమాలో మొత్తంగా ఎనిమిది యాక్షన్ బ్లాక్స్ ఉండబోతున్నాయట. అందులో ముఖ్యమైన ఐదు ఫైట్లు మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయట.

మొదట ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా యాక్షన్ బ్లాక్స్ మర్చిపోనీ విధంగా చేస్తాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక ప్రముఖ స్టార్ హీరో కూడా గెస్ట్ రోల్ చేస్తాడు అని అతనితో వచ్చే యాక్షన్ సన్నివేశం కూడా హైలెట్ అవుతుందట. ఇక ఫస్ట్ పార్ట్ లో విలన్ గా కనిపించిన ఫహద్ ఫాసిల్ తో వచ్చే మరో బిగ్ ఫైట్ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ యాక్షన్ సన్నివేశాల కోసమే దర్శకుడు సుకుమార్ దాదాపు 70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఒక ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం 20 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందట. యాక్షన్ సినిమా అంటే ఎలా ఉండాలో ఈసారి సుక్కు తనదైన శైలిలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post