సలార్ - KGF.. ఇలా లింక్ పెట్టేశారు!


దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా వరల్డ్ లో మంచి గుర్తింపు అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా కథకు సలార్ కు లింకు ఉంటుందా లేదా అనే విషయం అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ విషయంపై చిత్ర యూనిట్ లో ఎవరూ కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ తప్పకుండా లింక్ ఉంటుంది అని ఇండస్ట్రీలో టాక్ వస్తోంది.

రాఖీ బాయ్ సముద్రంలో పడిపోయిన తర్వాత ఆ సామ్రాజ్యంలోకి సలార్ గా ప్రభాస్ వస్తాడు అని ఇదివరకే ఒక టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు టీజర్ అప్డేట్ ఇవ్వడంతో మరొక కొత్త తరహా గాసిప్ ఐతే వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ ఆ విషయాన్ని బాగా వైరల్ చేస్తున్నారు. సినిమా టీజర్ ను ఈనెల ఆరవ తేదీన సాయంత్రం 5:12 కు విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ఒక పోస్టర్ను విడుదల చేశారు. అయితే ఇదే సమయానికి కేజిఎఫ్ సెకండ్ పార్ట్ లో రాఖీ బాయ్ చనిపోతాడు. ఇప్పుడు టీజర్ కు అదే టైమ్ సెట్ చేయడంతో స్క్రీన్ షాట్స్ తీసి మరి ఫ్యాన్స్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ప్రతి పాయింట్ ను కూడా సినిమాలో హైలెట్ చేసే దర్శకుడు ప్రశాంత్ ఈ విషయాన్ని కూడా ఫోకస్ చేసి ఉంటాడు అని ఊహించుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో అనేది తెలియదు కానీ తప్పకుండా సలార్ కు కేజీఎఫ్ కు లింకు మాత్రం ఉంటుంది అని తెలుస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి.

Post a Comment

Previous Post Next Post