బేబీ మూవీ - రివ్యూ & రేటింగ్


కథ:
ఒకే బస్తీకి చెందిన ఆనంద్ (ఆనంద్ దేవరకొండ), వైష్ణవి (వైష్ణవి చైతన్య) 10వ తరగతి నుంచి ప్రేమించుకుంటారు.  అప్పటి వరకు హాయిగా ఉండగా.. ఇంజినీరింగ్ కాలేజీలో వైష్ణవి కొత్త పరిచయాల కారణంగా ఊహించని విధంగా మారుతుంది.  అక్కడ చదువుతున్న ధనవంతుడు విరాజ్ (విరాజ్ అశ్విన్) వైష్ణవికి దగ్గరవుతాడు.  వైష్ణవికి ఖరీదైన బహుమతులు కొంటాడు.  వైష్ణవి తన రూపాన్ని పూర్తిగా మార్చుకుని అల్ట్రా మోడ్రన్‌గా మారుతుంది.  వైష్ణవి వేషధారణ చూసిన ఆనంద్ ఆమెను దారుణంగా అసహ్యించుకుంటాడు.  అయోమయ స్థితిలో, వైష్ణవి  విరాజ్‌కి మరింత దగ్గరవుతుంది. ఇక ఈ ముక్కోణపు ప్రేమకథ ఎలా ముందుకు సాగుతుంది అనేది మిగతా కథ.

విశ్లేషణ:
ముందుగా ‘బేబీ’ అనేది యువతకు బాగా నచ్చే ప్రేమకథ. ఈ కథ ప్రస్తుత తరం ప్రేమకథలకు అద్దం పట్టింది అని చెప్పవచ్చు. దర్శకుడు సాయి రాజేష్ రియాలిటీకి దగ్గరగా స్క్రిప్ట్ డిజైన్ చేశారు అనిపిస్తోంది. ఈ సినిమా క్లాస్ లవ్ స్టోరీ అని ట్రైలర్స్ సూచించాయి. కానీ సన్నివేశాలు మాత్రం చాలా బోల్డ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా డైలాగ్స్ బూతులు ఫ్యామిలీ ఆడియెన్స్ ను కాస్త ఇబ్బంది పెట్టేవే. కానీ నేటి పరిస్థితుల కాలంలో స్కూల్ ఇంటర్ దశ వరకు చాలా నార్మల్ గా ఉన్న ఒక అమ్మాయి హఠాత్తుగా హై లెవెల్లో కాలేజ్ వలన ఎలా చేంజ్ అవుతారు అనేది పర్ఫెప్ట్ గా ప్రజెంట్ చేశారు. ఒక సాధారణ కుర్రాడికి కొన్ని సీన్స్ అయితే గుండెను తాకుతాయు.

వైష్ణవి కాలేజీకి వెళ్లే వరకు స్లో పేస్‌లో సాగే ఈ సినిమా రొటీన్‌గా సాగుతుంది. తర్వాత డైరెక్టర్ ప్రొసీడింగ్స్ పై కమాండ్ చూపించాడు. ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్. సెకండాఫ్ ప్రారంభంలో వైష్ణవి బలవంతంగా తప్పులు చేసేలా చూపించిన తీరు ఆసక్తికరంగా ఉంది. మరోవైపు, ప్రీ-క్లైమాక్స్ ఎపిసోడ్‌లు లాగడం వల్ల సినిమా వ్యవధి కొంచెం ఎక్కువ. అక్కడక్కడా కొన్ని సీన్స్ రొటీన్ గా ఉన్నప్పటికీ దర్శకుడు మళ్ళీ మరో సీన్ తో వెంటనే బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసిన విధానం బావుంది.

కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా వర్కౌట్ అయ్యాయి. రియాలిటీకి దగ్గరగా ఉండాలి అని దర్శకుడు బూతులు అయితే మరింత బోల్డ్ గా దించేశాడు. మ్యుట్ అయినప్పటికీ అర్ధమవుతుంది. సెన్సార్ ఇబ్బందులు రాకుండా తెలివిగా ముందుకు వెళ్లారు అనిపిస్తోంది. ఇక సినిమాలో పాటలు సినిమాకు బాగానే హెల్ప్ అయ్యాయి. చక్కగా చిత్రీకరించబడ్డాయి. ఇక బేబీ సినిమాలో వైష్ణవి పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. ఆమె మొదట్లో అమాయకంగా ఉన్న విధానం అలాగే సెకండ్ హాఫ్ లో హఠాత్తుగా మరో లుక్ లోకి వచ్చిన విధానంలో అద్భుతమైన హావభావాలు చూపించింది. నటిగా తన పాత్రకు అమ్మడు సరైన న్యాయం చేసింది.

సినిమాటోగ్రఫీ, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వంటి టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ తమ పనిని చక్కగా చేశాయి. మాస్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక ఆనంద్ దేవరకొండ ఇప్పటివరకు కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన సినిమా ఇదే అని చెప్పవచ్చు. కథకు తగ్గట్టుగా అతను తనను తాను చాలా చేంజ్ చేసుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో చాలా బాగా నటించాడు. షో స్టీలర్ వైష్ణవి చైతన్య తొలి హీరోయిన్. విరాజ్ అశ్విన్ లుక్ ఓకే, అలాగే క్యారెక్టర్ కి సూట్ అయ్యాడు. 

ఇక ‘బేబీ’ సినిమా అనేది యువతను ఉద్దేశించి తీసిన సినిమా. నేటితరం జరిగే పరిణామాలు యువతకు బాగా తెలుసు కాబట్టి ఈ కథ వారికి బాగానే నచ్చుతుంది. ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ లో అలాగే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని సాగదీసే సీన్స్ కూడా ఉన్నాయి. నిడివి చాలా ఎక్కువ అనే భావన కలుగుతుంది. ఓవరాల్ గా థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం బేబీ డైలాగ్స్ సీన్స్ ఆడియెన్స్ ను టచ్ చేస్తాయి. కాబట్టి బేబీకి యూత్ నుంచి గట్టిగా సపోర్ట్ వస్తే బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుంది.  

ప్లస్ పాయింట్స్:
👉వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ యాక్టింగ్
👉ఎమోషనల్ సీన్స్
👉బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
👉నిడివి ఎక్కువవ్వడం
👉కొన్ని బోర్ కొట్టించే సీన్స్
 
రేటింగ్: 3/5

Post a Comment

Previous Post Next Post