రష్మిక సినిమాలు కూడా ఎత్తుకుపోతున్న శ్రీలీల?


ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలు దర్శకులు చాలా వరకు శ్రీలీల పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. అందానికి, టాలెంట్ కు సరైన అదృష్టం తోడు కావడంతో అమ్మడు స్టార్ బ్యూటీలకు కూడా ఊహించని విధంగా పోటీగా మారుతోంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డేను దాటేసి మేయిన్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు నేషనల్ క్రష్ సినిమాలకు కూడా ఎసరు పెట్టేసింది. 

రష్మిక మందన్న నితిన్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బీష్మ సినిమా కాంబినేషన్లో వెంకీ కుడుముల దర్శకుడిగా వస్తున్న ఆ సినిమా పై ఆ మధ్య కొత్తగా ఒక అప్డేట్ ఇచ్చారు. అయితే ఇటీవల దర్శకుడు వెంకీ కుడుముల రష్మికను కాదని శ్రీలీల ను ఫిక్స్ చేయాలని హీరోకు నిర్మాతకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి చిత్ర యూనిట్ ఈ వార్తలపై ఏమైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post