బాలయ్య దర్శకుడిపై మెగాస్టార్ ఫోకస్!


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. అలాగే మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు దాదాపు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయి. అలాగే బింబిసార దర్శకుడు వశిష్టతో కూడా ఒక సినిమా చేయాలని చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఈ తరుణంలో బాలయ్యతో వర్క్ చేస్తున్న మరో దర్శకుడిపై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాను అనిల్ రవిపూడి తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఆ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఉందట. ఇప్పటికే కొన్నిసార్లు ఈ దర్శకుడు తో మెగాస్టార్ చర్చలు కూడా జరిపారు. ఇక అనిల్ కు కూడా ఇప్పట్లో పెద్ద హీరోలు దొరికే అవకాశం లేదు. కాబట్టి మెగాస్టార్ తో ఛాన్స్ ను అసలు వదులుకోవద్దు అని ఫిక్స్ అయ్యాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post