ఇస్మార్ట్ కాంబో.. బడ్జెట్ గట్టిగానే..!


డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో ఊహించిన విధంగా డిజాస్టర్ ఎదుర్కోవడంతో అతను చేయబోయే తదుపరి సినిమా ఎలా ఉంటుంది అనే విషయం అందరిలోనే ఆసక్తిని కలిగిస్తుంది. అయితే పూరి తనకు బాగా కలిసి వచ్చిన రామ్ పోతినేని తో సినిమా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకునే పూరి జగన్నాథ్ కు మంచి లాభాలు అయితే అందించింది.

ఇప్పుడు ఇదే కాంబినేషన్లో రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా జూలై నెలలోనే లంచ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు పూరి జగన్నాథ్ బడ్జెట్ దాదాపు 35 నుంచి 40 కోట్ల మధ్యలో ఫిక్స్ చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మాస్ మసాలా యాక్షన్ ఎలిమెంట్స్ ఉండే విధంగా అలాగే కొంత టెక్నాలజీ బ్యాగ్రౌండ్ లో ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారట. సినిమా పాన్ ఇండియా లెవెల్లోనే వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని పూరీ కసితో ఉన్నాడు. మరి పూరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post