2024 సంక్రాంతి.. ఎవరెవరు వస్తున్నారంటే?


2024 సంక్రాంతి ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. పొంగల్ అనగానే సౌత్ ఇండస్ట్రీలో సినిమాలకు ఒక మంచి జాక్ పాట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకేసారి నాలుగు సినిమాలు కూడా వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మినిమమ్ రెండు పెద్ద సినిమాలు మరో రెండు చిన్న సినిమాలు పోటీకి దిగుతూ ఉంటాయి. ఇక ఇందులో ఏదో ఒక చిన్న సినిమా మాత్రం గట్టిగానే కలెక్షన్స్ అందుకుంటూ ఉంటుంది.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతిని కూడా మన హీరోలు టార్గెట్ చేశారు.  ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న హనుమాన్ సినిమా ఏకంగా మహేష్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలతో పోటీకి సై అంటుంది. అయితే ఈ మూడు సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయి అని చిత్ర యూనిట్ ప్రస్తుతానికైతే ఫిక్స్ అయింది. ఇక భవిష్యత్తులో మళ్లీ షూటింగ్స్ లో ఏదైనా తేడా వస్తే మాత్రం గుంటూరు కారం అలాగే ప్రాజెక్టుకే డేట్స్ విషయంలో మార్పులు రావచ్చు.

కానీ ఎట్టి పరిస్థితుల్లో వీరు సంక్రాంతిని మిస్ చేసుకోవద్దు అనుకుంటున్నారు. అలాగే విజయ్ దేవరకొండ పరుశురామ్ సినిమా కూడా సంక్రాంతికి రావచ్చు. అలాగే మరో రెండు స్టార్ హీరోల సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. అయితే ఈ పోటీలో మాత్రం ప్రాజెక్టు కే ఉంటే గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే థియేటర్స్ విషయంలో కూడా గందరగోళం జరిగే ఛాన్స్ ఉంది. మరియు వీటిని నిర్మాతలు ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post