ఖుషి.. ఇదే టైటిల్ ఎందుకు పెట్టారంటే..?


విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమాకు అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో అనే ప్రశ్న చాలా మందికి కలిగే ఉంటుంది. దర్శకుడు శివ నిర్వాణ లవ్ ఎమోషనల్ కంటెంట్ ను హైలెట్ చేయడంలో సిద్ధహస్తుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతను పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ అయినటువంటి ఖుషి అనే టైటిల్ ను టచ్ చేయడం వెనుక అంత ఈజీగా ఆలోచించడు అని చెప్పవచ్చు.

ఇక అందుకు బలమైన కారణం ఏమిటంటే.. సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఉండే ఈగో పాయింట్ ను హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో వచ్చిన ఖుషీలో భూమిక, పవన్ ఎలాగైతే ఈగో పాయింట్ తో గోల చేశారో అలాగే ఇప్పుడు సమంత, విజయ్ కూడా అహంకారం అనే పాయింట్ తో సతమతమయ్యే జంటగా కనిపిస్తారట. 

కాకపోతే దర్శకుడు లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా కొత్త ఖుషిని తెరపైకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఖుషి సోల్ పాయింట్ తో రాసుకున్న కథనే కాబట్టి అదే టైటిల్ పెట్టేస్తే మంచి బజ్ క్రియేట్ అవుతుంది అని  శివ నిర్వాణ ఆలోచించడట. సినిమాలో సామ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన సాంగ్స్ మంచి బజ్ అయితే క్రియేట్ చేశాయి. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post