గుంటూరు కారం.. ఆగిపోవడానికి ఛాన్సే లేదు!


మహేష్ బాబు గుంటూరు కారం సినిమా అసలు ఫినిష్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలా కాలంగా ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే సినిమా కథ రాసుకున్నప్పటి నుంచి కూడా ఈ కాంబినేషన్ పై రోజు ఏదో ఒక గాసిప్ టెన్షన్ ను క్రియేట్ చేస్తోంది. రెండు సార్లు సినిమా షూటింగ్ మొదలుపెట్టాక కథలో మార్పులు చేయాల్సి వచ్చింది.

ఇక గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఇటీవల మళ్ళీ మహేష్ బాబు అప్సెట్ అయినట్లు అందుకే ఫ్యామిలీతో కలిసి ఒక ఫారిన్ ట్రిప్ వేశాడని ఆలోపు త్రివిక్రమ్ కథలో మార్పులు చేస్తాడు అని టాక్ అయితే వినిపించింది. అయితే ఇప్పుడు మళ్లీ గుంటూరు కారం ఫినిష్ అవుతుందా లేదా అసలు సంక్రాంతి వస్తుందా లేదా అని అనుమానాలు వస్తున్నాయి. నిజానికి సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు కానీ తప్పకుండా సినిమా షూటింగ్ అయితే ఫినిష్ అవుతుంది అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఇప్పటికే నిర్మాతలు ఈ సినిమాపై దాదాపు 100 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు. అందులో 60 శాతానికి పైగా నటీనటుల టెక్నీషియన్స్ పారితోషకాలే ఉంటాయి. ఇక షూటింగ్ కోసం 30 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. అంతకుముందు దాదాపు 10 కోట్ల వరకు సినిమా షూటింగ్ క్యాన్సిల్ కావడం వలన ఆవిరైపోయాయి. ఇక ఇంత జరిగింది కాబట్టి మహేష్ బాబు తప్పుకునే అవకాశం అయితే లేదు. దానికి తోడు నిర్మాతలు బయ్యర్ల నుంచి అడ్వాన్సులు కూడా తీసుకున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. కాబట్టి సినిమా ఆగిపోతుంది అన్న విషయంలో అయితే అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

Post a Comment

Previous Post Next Post