సమంత బ్రేక్.. రూ.30 కోట్ల నష్టం!


సమంత రూత్ ప్రభు ఆరోగ్యం కోసం ఒక ఏడాది పాటు లాంగ్ బ్రేక్ తీలుకోబోతోంది. ఇక ఈ స్టార్ నటి ఎటువంటి ప్రాజెక్ట్‌లకు సంతకం చేయడానికి సిద్ధంగా లేదు. కొందరు నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ చెల్లింపులను కూడా తిరిగి ఇచ్చింది. ది ఫ్యామిలీమ్యాన్ 2తో పాన్-ఇండియన్ ఇమేజ్ సంపాదించిన తర్వాత నటి తన ఫీజును పెంచింది. 

ఇక విజయ్ దేవరకొండ తో చేస్తున్న ఖుషి సినిమాకు ఆమె దాదాపు 5 కోట్లు తీసుకుంది. ఇక బాలీవుడ్ సిటాడేల్ కోసం కూడా ఐదు కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న సమంత ఏడాదికి ఈ రెండు సినిమాలతోనే 10 కోట్లు అర్జించింది. ఇక ఆమె ఇతర బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా ఏడాదిలో 10 నుంచి 15 కోట్ల వరకు సంపాదిస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఆమె ఒక ఏడాదిలో 25 కోట్ల నుంచి 30 కోట్ల మధ్యలో ఆదాయాన్ని అందుకుంటుంది. ఇక ఇప్పుడు బ్రేక్ ఇవ్వడం వలన దాదాపు 30 కోట్లు పోగొట్టుకున్నట్లు లెక్క. కానీ ఆమె తన ఆరోగ్యం కోసం ఆలోచించి డబ్బును పక్కన పెట్టేసింది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేస్తోంది.

Post a Comment

Previous Post Next Post