లైగర్ దెబ్బ కొట్టినా... పూరి అసలు మారలేదు?


ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అతివేగంగా సినిమా షూటింగ్స్ పూర్తి చేసుకున్న దర్శకులలో పూరి జగన్నాథ్ మంచి గుర్తింపు అయితే అందుకున్నారు. అయితే ఆయన వేగమే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మార్కెట్ లేకుండా చేసింది. ఒకప్పుడు ఫ్రెష్ ఐడియాలతో బాగానే దూసుకుపోయిన పూరి ఇప్పుడు కూడా మళ్లీ అదే ఫార్మాట్లో వెళితే సరిపోతుంది అనుకున్నాడు.. కానీ లైగర్ దెబ్బకు మళ్లీ ఒక్కసారిగా డౌన్ అయ్యారు.

అయితే పూరి జగన్నాథ్ తన ప్రతి సినిమాకు ఏవైతే తప్పులు చేస్తున్నాడో మళ్ళీ ఈసారి డబుల్ ఇస్మార్ట్ సినిమా విషయంలో కూడా అదే మిస్టేక్స్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ రోజుల్లో ఒక స్క్రిప్ట్ రాసుకుంటే చాలా వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే అందరూ కూడా జాగ్రత్త పడుతున్నారు. నటీనటుల నుంచి అలాగే సినిమా లొకేషన్స్ వరకు అన్ని ముందుగానే ప్లాన్ పక్క ప్లాన్ తో రెడీ చేసుకుంటున్నారు.  

కానీ ఇప్పుడు పూరి రెగ్యులర్ రొటీన్ పద్ధతిలోనే డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ను ముంబైలో మొదలు పెట్టేసాడు. ఇంకా హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, విలన్ అలాగే ఇంకా మరికొన్ని క్యారెక్టర్స్ విషయంలో నిర్ణయాలు మాత్రం తీసుకోలేదు. ఒకసారి లైగర్ తో దెబ్బతిన్న పూరి ఈసారి పక్కా ప్లాన్ తో వెళ్తాడు అనుకుంటే మళ్ళీ ఎప్పటిలాగే ప్లాన్ లేకుండా వెళుతున్నారు.

ఆయనకు ఒక క్లారిటీ ఉండవచ్చు కానీ ఈ రోజుల్లో తొందరపాటు నిర్ణయాలు సినిమా ఫలితాలను చాలా దారుణంగా మారుస్తున్నాయి. ఎంతో ఆలోచించి గాని దర్శకులు నిర్ణయాలు తీసుకోవడం లేదు. రాజమౌళి ఇప్పుడు ఆ స్థాయిలో ఉండడానికి కారణం ఆయన ముందస్తు ప్రణాళికనే. ఆయన పక్క ప్రణాళికతో వెళుతూ ఉంటారు. బౌండెడ్ రాసుకున్న తర్వాత అవసరమైతే టెస్ట్ షూట్ కూడా చేస్తారు. క్యాస్టింగ్ విషయంలో కూడా ముందుగానే నిర్ణయం తీసుకుంటారు. ఇక పూరి కూడా గత రికార్డులతో పోలిస్తే జక్కన్న రేంజ్ కంటే తక్కువేమీ కాదు. మరి అలాంటి పూరి ఇలా ఎందుకు ప్లాన్ లేకుండా వెళుతున్నాడో అర్థం కావడం లేదు.

Post a Comment

Previous Post Next Post