గజిని డైరెక్టర్ రేంజ్ తగ్గినట్లేనా..?


తమిళ ఇండస్ట్రీలో ఒకప్పుడు శంకర్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సినిమాలు తీయగల అద్భుతమైన దర్శకులలో ఏఆర్ మూగదాసు కూడా టాప్ లిస్టులో ఉండేవారు. తెలుగులో గజిని సినిమా ద్వారానే ఆయన కూడా ఒక మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ఇక 7th సెన్స్ సినిమా కూడా తమిళంలో కంటే తెలుగులోనే మంచి ఓపెనీయంగ్స్ అందుకుంది.

అలాగే తుపాకీ సర్కార్ సినిమాలకు కూడా తెలుగులో మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ దర్శకుడు రేంజ్ కాస్త తగినట్లు అనిపిస్తోంది. అజిత్ విజయ్ సూర్య రజినీకాంత్ లాంటి హీరోలతో వర్క్ చేసుకుంటూ వచ్చిన మురగదాస్ ఇప్పుడు వారి కంటే తక్కువ రేంజ్ లో ఉన్న శివ కార్తికేయన్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

ఆ మధ్య తెలుగులో మళ్లీ చిరంజీవితో చేస్తున్నాడు అని టాక్ వచ్చింది. కానీ ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. తమిళ్ హీరో విజయ్ కూడా మురగదాస్ మళ్ళీ బ్రేక్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ అతను కూడా చివరికి హ్యాండ్ ఇచ్చేసాడు. ఇక చివరికి ఇప్పుడు శివ కార్తికేయన్ తో మురుగదాస్ తెలుగు తమిళ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాజెక్టును తెరపై తీసుకువస్తున్నాడు. మరి ఆ ప్రాజెక్టుతో అయినా మురగదాస్ మరో రేంజ్ కు వెళ్తాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post