ఇలా మోసం చేయకు నిఖిల్!


కొన్నిసార్లు హీరోలకు నచ్చకపోయినా కూడా కమిట్ అయిన తర్వాత సినిమాలను పూర్తి చేయక తప్పదు. అయితే స్పై సినిమా చూసిన తర్వాత ఇప్పుడు అందరి మదిలో నిఖిల్ అసలు ఈ సినిమా కథను ముందుగా వినే చేశాడా లేకపోతే.. అడ్వాన్స్ తీసుకొని తప్పని పరిస్థితుల్లో పూర్తి చేశాడా అనే అనుమానాలు వస్తున్నాయి. సినిమాలో ఏదో మిస్టరీ ఉంటుంది అనుకుంటే అది ప్రేక్షకులకు చివరి వరకు కూడా ఏమీ చూపించకుండానే మిస్టరీ మిస్టరీగానే ఉంటుంది అని ప్రజెంట్ చేశారు.

దర్శకుడు మేకింగ్ విధానం అసలు ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. నిఖిల్ కార్తికేయ 2 సినిమా కంటే ముందు వరకు కూడా డిఫరెంట్ సినిమాలతో బాగానే ఆకట్టుకున్నాడు. కానీ ఈసారి స్పై సినిమాతో ప్రేక్షకులను చాలా రకాలుగా మోసం చేశారు అని అనిపిస్తోంది. సుభాష్ చంద్రబోస్ బ్యాక్ డ్రాప్ మిస్టరీ, RAW ఏజెంట్, ఇండియా సెంటిమెంటును తీసుకుని అదే తరహాలో ప్రమోషన్స్ కూడా చేశారు.

ఇక నిర్మాతకు హీరోకు మధ్య కొన్ని వైరాలు ఉన్నాయని కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. నిఖిల్ అయితే చాలా వరకు సౌమ్యమైన వ్యక్తి. అతను పెద్దగా వివాదాలు లేకుండానే చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ స్పై విషయంలో అసలు కావాలని గొడవలు క్రియేట్ చేసినట్లు అనిపిస్తోంది. మొత్తానికి సినిమాలో కంటెంట్ లేదు. మొదటి రోజు నిఖిల్ మీద నమ్మకంతోనే ఆడియెన్స్ బాగానే చూశారు. దీంతో అతనికి బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి.

ఆ రేంజ్ లో ఆడియెన్స్ నుంచి నమ్మకం చూపించినప్పుడు నిఖిల్ జాగ్రత్తగా ఉండాలి. ఎంతో నమ్మకం పెట్టుకున్న నిఖిల్ ఈ విధంగా ఆడియన్స్ ను సుభాష్ చంద్రబోస్ మిస్టరీ అంటూ మోసం చేయడం అసలు ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మంచి కెరీర్ ఉన్న నిఖిల్ ఆడియన్స్ నమ్మకాన్ని కోల్పోకుండా చిన్న బడ్జెట్లో ఆయినా సరే మంచి కంటెంట్ చూపిస్తే బెటర్ అని చెబుతున్నారు. మరి నిఖిల్ తదుపరి సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post