బాలయ్య కోసం నయన్.. రెమ్యునరేషన్ తట్టుకుంటారా?


నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో నయనతార నటించే అవకాశం ఉన్నట్లుగా కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. గతంలో బాలయ్యతో నయన్ సింహం,  శ్రీరామరాజ్యం అలాగే జై సింహ అనే సినిమాలు చేసింది. మూడు కూడా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి బాలయ్య బాబు 109వ సినిమా కోసం నయనతారను సంప్రదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అనుకోవడం వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు నయనతార రేంజ్ మామూలుగా లేదు. ఏకంగా షారుక్ ఖాన్ తో జవాన్ సినిమా ఒప్పుకున్నప్పటినుంచి ఆమె రెమ్యునరేషన్ అయితే హై రేంజ్ లోనే డిమాండ్ చేస్తోంది. జవాన్ సినిమా కోసమే ఆమె దాదాపు పది కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. ఇక ఆ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి లోకల్ సినిమాలకు అయితే మరో రేటు చెబుతోంది.

తమిళ్ తెలుగు సినిమాలకు మినిమం 7 నుంచి 9 కోట్ల మధ్యలోనే అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంతకుముందు ఐదు కోట్ల రేంజ్ లోనే ఉన్న నయనతారకు డిమాండ్ ఉన్నప్పుడు నిర్మాతలు బాగానే ఇచ్చారు. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ అడుగుతూ ఉండడంతో కాస్త ఆలోచిస్తున్నారు. మరి NBK 109 ప్రొడక్షన్ హౌస్ లు సితార ఎంటర్టైన్మెంట్ - ఫార్చూన్ ఫోర్ బ్యానర్లు నయన్ కు అడిగినంత ఇస్తారా లేక మరొకరిని ఫైనల్ చేస్తారా అనేది వేచి చూడాలి.

Post a Comment

Previous Post Next Post