గ్రూప్ 4 పరీక్షలో "బలగం"పై ప్రశ్న!


తెలంగాణాలో ఇటీవల నిర్వహించిన TSPSC గ్రూప్ 4 పరీక్షలో “బలగం” చిత్రానికి సంబంధించిన ప్రశ్నలు రావడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తెలంగాణా సంస్కృతికి సంబంధించిన నేపధ్యంలో సినిమాను తెరపైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన ఒక ప్రశ్న పరీక్షలో రావడంతో ఆ విషయాన్ని చిత్ర దర్శకుడు వేణు యెల్దండి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు మరియు నటుడితో సహా చలనచిత్రంలోని వివిధ అంశాలను సరిగ్గా జత చేయమని అభ్యర్థులను అడిగిన ప్రశ్నలలో ఒకటి. అందులో అందించిన ఎంపికలు ఎ. దర్శకుడు: వేణు యెల్దండి, బి. నిర్మాత: దిల్ రాజు/హన్షితా రెడ్డి/హర్షిత్ రెడ్డి, సి. సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, డి. కొమరయ్యగా అరుసం మధుసూధన్ నటించారు.. అని అందులో మెన్షన్ చేయడం విశేషం. అదేవిధంగా, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా “బలగం” అనే ప్రశ్నను చేర్చారు. ఈ సినిమా కంటెంట్ ప్రతీ గ్రామాన్ని ఎంతగా టచ్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక చిత్రం ఈ పరీక్షలు నిర్వహిస్తున్న అధికారుల దృష్టిని ఆకర్షించిందని స్పష్టంగా అర్ధమవుతోంది.


Post a Comment

Previous Post Next Post