కమ్ములను నమ్మలేకపొతున్న ధనుష్.. ఏం జరుగుతోంది?


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ సినిమా చేయబోతున్నట్లుగా చాలా కాలం క్రితం ప్రకటించారు. అయితే ఏడాది దాటినా కూడా ఈ సినిమాపై ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అసలు ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందా లేదా అనే విధంగా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. నిజానికి అసలు కథ ఫైనల్ అయిన తర్వాత ధనుష్ బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యేలా శేఖర్ కమ్ముల ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.

అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు ధనుష్ కు ఫైనల్ స్క్రిప్ట్ గురించి వినిపించడం జరిగింది. కానీ అతను ఇంకా సంతృప్తి చెందడం లేదట. ఏదో మిస్ అవుతుంది అని ప్రతిసారి కమ్ముల చేత కథ విషయంలో మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో కమ్ముల కూడా కాస్త నిరాశ పడినట్లు సమాచారం. లవ్ స్టోరీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ఈ ప్రాజెక్టును అయినా సరే తొందరగా మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ ధనుష్ జాగ్రత్తలతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు కంత ఆలస్యం అవుతుంది. మరి ఈ విషయంపై చిత్ర నిర్మతలు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. ఏషియన్ సినిమాస్ కాంబినేషన్లో తెరపైకి రాబోయే ఈ సినిమాను పాన్ ఇండియా మార్కెట్ కు తగ్గట్టుగా నిర్మించాలని అనుకున్నారు.

Post a Comment

Previous Post Next Post