రామ్ చరణ్ - సేతుపతి.. నిజమేనా?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా దాదాపు ఫినిష్ అయ్యాయి. ఇక వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలి అని దర్శకుడు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాలో మరొక ప్రముఖ స్టార్ కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా ఉండబోయే ఈ సినిమా కథలో ఒక కీలకమైన పాత్ర కూడా ఉండబోతుందట. ఇక ఆ పాత్ర కోసం విజయ్ సేతుపతినే సెలెక్ట్ చేసుకోవాలి అని బుచ్చిబాబు అనుకుంటున్నాట్లుగా తెలుస్తోంది. ఇదివరకే ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతిని పవర్ ఫుల్ విలన్ గా చూపించిన బుచ్చిబాబు ఈసారి రామ్ చరణ్ తో మాత్రం నెగిటివ్ రోల్ లో కాకుండా చాలా ఇంపాక్ట్ ఉండే పాత్రలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఈ ఏడది చివరలో మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post