బేబీ హీరోయిన్.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే..!


బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటూ చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక మొత్తానికి ఎప్పటినుంచో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆనంద్ దేవరకొండకు ఈ సినిమాతో సరైన సక్సెస్ పడింది. అలాగే హీరోయిన్ గా కూడా మొదటి సినిమా చేసిన వైష్ణవి చైతన్య కూడా ఇది కెరీర్ బెస్ట్ మూవీ గా నిలుస్తుంది అని చెప్పవచ్చు.

అయితే ఇకనుంచి ఈ బ్యూటీ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ తరహా కంటెంట్తో వచ్చిన హీరోయిన్స్ క్లిక్ అయిన సందర్భాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ జనాల్లో సినిమా విడుదలైనప్పుడు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసుకుంది. క్యారెక్టర్ ఆ రేంజ్ లో క్లిక్ అయింది కాబట్టే సినిమాకు కాసుల వర్షం కురిసింది.

ఇక ఇప్పుడు బేబీ సినిమాకు కూడా అదే తరహాలో ప్లాన్ వర్కౌట్ అయింది. అయితే ఈ నెగిటివ్ ఇంపాక్ట్ వీలైనంత తొందరగా పోవాలి. ఆర్ఎక్స్ 100 తో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కొట్టినా కూడా పాయల్ కు ఆ క్యారెక్టర్ కారణంగా ఏమో తెలియదు గానీ ఆ బ్యూటీకి మళ్లీ స్టార్స్ సినిమాలో పాజిటివ్ రోల్స్ పడలేదు. ఇక ఇప్పుడు బేబీ హీరోయిన్ కూడా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోబోయే పాత్రలు వీలైనంత తొందరగా నెగిటివ్ ఇంపాక్ట్ ను తొలగించాలి మరి ఆమె ఏ విధంగా అడుగులు వేస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post