ప్రాజెక్ట్ K - 500 కోట్ల ప్రాజెక్ట్ లో ఇలాంటి లుక్కా?


వైజయంతి మూవీస్ 50 సినిమాల అనుభవం ఉన్న ప్రొడక్షన్ హౌస్.. ఇక 500 కోట్లతో నిర్మిస్తున్నారు. పైగా మంచి టాలెంటెడ్ ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్. మంచి యూనిట్. ఇక ఇండియాలోనే కాకుండా వివిధ ప్రపంచాలలో కూడా ప్రభాస్ రేంజ్ ఇప్పుడు పెరిగే విధంగానే ఉంది. అయితే ఇలా అన్ని మంచి రూట్స్ ఉన్న సమయంలో ప్రాజెక్ట్ K పాన్ వరల్డ్ సినిమా రాబోతుంది అనగానే ఫ్యాన్స్ ఎంతగానో సంతోషించారు.

ప్రభాస్ ఇటీవల కాలంలో వరుసగా నిరాశ పరుస్తూ ఉండడంతో తప్పకుండా ఈ సినిమా మరో రేంజ్ ఉంటుంది అనే ఆశతో అయితే ఉన్నారు. కానీ కొద్దిసేపటి క్రితం విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది. ఏదో ఐరన్ మాన్ పోస్టర్ ని అటు ఇటుగా మార్చేసే ప్రభాస్ తలను పెట్టేసినట్లుగా ఉంది అని, ఇది ఒక మార్ఫింగ్ పిక్ అన్ని కూడా అంటున్నారు. దీని కన్నా ఫ్యాన్స్ మేడ్ పోస్టర్లు బెస్ట్ కదా అని అంటున్నారు.

500 కోట్ల ప్రాజెక్ట్ నుంచి ఒక మంచి పోస్టర్ విడుదల చేసే ఛాన్స్ దొరకలేదా? అని మరికొందరు ఊహించిన విధంగా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు నాగ్ అశ్విన్ ఈ తరహాలో నిరాశ పరుస్తాడు అని అనుకోలేదు అని అంటున్నారు. మరి అమెరికాలో ఫస్ట్ గ్లింప్స్ భారీ స్థాయిలోనే విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. మరి దాంతో ఆయన మెప్పిస్తారో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post