బన్నీతో పాన్ ఇండియా.. ఆ తప్పు చేయకండి త్రివిక్రమ్?


త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అనగానే ముందుగా సినిమాలో మంచి డైలాగ్స్ మంచి సీన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. కానీ అవి ఏదో ఒక సినిమాలో నుంచి కాపీ కొట్టినవి అని చాలాసార్లు రుజువు అయ్యాయి. కథల విషయంలో కూడా కాపీ కొట్టగా చాలాసార్లు త్రివిక్రమ్ నిర్మాతలను ఇబ్బంది పెట్టాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. 

త్రివిక్రమ్ మార్కెట్ పెరగడంలో అయితే బన్నీ చాలా కీలకపాత్ర పోషించాడు. ఈ కాంబినేషన్లో వచ్చిన జులాయి సన్నాఫ్ సత్యమూర్తి, అలాగే అల..వైకుంఠపురములో.. మూడు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా దేనికవే.. డిఫరెంట్ కానీ ఇప్పుడు బన్నీతో పాన్ ఇండియా అంటే త్రివిక్రమ్ తన స్టైల్ మొత్తం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. అల..వైకుంఠపురములో తెలుగులో అంత పెద్ద హిట్ అయినా కూడా బాలీవుడ్లో అసలు ఏ మాత్రం సక్సెస్ కాలేదు. 

ఇక ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ ఏమో  పాన్ ఇండియా లెవెల్ లో గట్టిగానే పెరిగింది. కాబట్టి మంచి యాక్షన్ తో పాటు హై లెవెల్ డ్రామా కూడా ఉండాలి. ఇక ఇన్ని రోజులు త్రివిక్రమ్ ఫాలో అయిన డ్రామాలు కాస్త పక్కనపెట్టి హై వోల్టేజ్ సీన్స్ తో కొనసాగితేనే పాన్ ఇండియా లెవెల్లో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎక్కడ కూడా కాపీ తరహా కంటెంట్ లేకుండా ఉంటేనే బాలీవుడ్లో క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే నార్త్ జనాలు మరో లెవెల్లో ట్రోలింగ్ అయితే చేస్తారు. మరి త్రివిక్రమ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి.

1 Comments

  1. Well made films will run everywhere. Movies without logic will not run just on punch dialogues except in Telugu.

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post