చైతూతో పాన్ ఇండియా అంటే కష్టమేమో..?


నాగచైతన్య కూడా ఇతర భాషల్లో సక్సెస్ అవ్వాలి అని ఆ మధ్య గట్టిగానే ప్రయత్నాలు చేశాడు. హిందీలో లాల్ సింగ్ చడ్డా సినిమాలో ఒక స్పెషల్ రోల్ కూడా చేశాడు. కానీ అవేమి అంతగా క్లిక్ కాలేదు. అంతేకాకుండా ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ కూడా అయింది. ఇక మొన్న తమిళ దర్శకుడితో చేసిన కస్టడీ సినిమా కూడా తేడా కొట్టేసింది. ఆ సినిమా తమిళంలో ఏ మాత్రం కలెక్షన్స్ అందుకోలేదు. అయితే ఇప్పుడు చందు మొండేటి నాగచైతన్య కోసం ఒక భారీ కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కార్తికేయ 2 సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు నాగచైతన్యకు చాలా క్లోజ్. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ప్రేమమ్ మంచి సక్సెస్ అయింది. ఆ తర్వాత వచ్చిన సవ్యసాచి మాత్రం దారుణంగా డిజాస్టర్ అయింది. అయితే ఇప్పుడు నాగచైతన్య కోసం ఈ దర్శకుడు భారీ స్పాన్ ఉన్న కథను సిద్ధం చేస్తున్నాడట. 

శ్రీకాకుళం తీరం నుంచి పాకిస్తాన్ బోర్డర్ వరకు సంబంధం ఉన్న కథను అల్లుతున్నట్లుగా తెలుస్తోంది. మొదట ఒక విలేజ్ బ్యాగ్ డ్రాప్లో మొదలయ్యే సినిమా ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండే ఒక సమస్య చుట్టూ కనెక్ట్ అవుతుందట. చూస్తూ ఉంటే దర్శకుడు నాగచైతన్య నెవర్ బిఫోర్ అనేలా దాన్ని ప్లాన్ చేస్తున్నాడు. అయితే అటు హిందీలో ఇటు తమిళంలో నాగ చైతన్య దారుణంగా ఫ్లాప్స్ ఎదుర్కొన్నాడు. మరి చందు ఏ విధంగా అతన్ని ప్రజెంట్ చేస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post