పూజా కోసం త్రివిక్రమ్.. చివరికి అలా సెటిల్మెంట్!


హీరోయిన్ గా చాలా బిజీగా ఉన్న సమయంలోనే పూజ హెగ్డేకు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ రావడం అలాగే గుంటూరు కారం సినిమా నుంచి తొలగించడం ఆమెకు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. వరుసగా బిగ్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో బిజీగా అవుతున్న సమయంలోనే ఆమె బయటకు రావడం నిజంగా ఊహించని ట్విస్ట్. 

ఇక ఇప్పుడు పూజా అయితే గుంటూరు కారంలో హీరోయిన్ గా లేకపోయినా కూడా ఆమెకు అందులోనే మరో ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అందుకు కారణం ఉంది. హీరోయిన్ గా అగ్రిమెంట్ అయినప్పుడే ఆమె అడ్వాన్స్ గట్టిగానే తీసుకుందట. అయితే ఇప్పుడు అడ్వాన్స్ వెనక్కి తీసుకురావడం అంత సాధారణమైన విషయం కాదు. 

ఇండస్ట్రీలో అడ్వాన్సులు వెనక్కి ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఇప్పుడు పూజా హెగ్డే తీసుకున్న అడ్వాన్స్ కు సరిపోయే విధంగా ఆమెతో గుంటూరు కారం సినిమాలో స్పెషల్ సాంగ్ చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా చేస్తే ఆమెకు క్రేజ్ తో పాటు కనీసం ఇచ్చిన రెమ్యునరేషన్ కు ఆమెను సరిగ్గా ఉపయోగించుకున్నట్టుగా ఉంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచిస్తున్నారని టాక్.

Post a Comment

Previous Post Next Post