సలార్ తెలుగు రైట్స్.. ఆఫర్స్ ఇలా ఉన్నాయి!


సలార్ సినిమాను నిర్మించిన హోంబెల్ ఫిలిమ్స్ అయితే థియేట్రికల్ బిజినెస్ విషయంలో చాలా గట్టిగా డీల్స్ సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తెలుగులో డబ్బింగ్ సినిమాలతోనే మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ సంస్థ ఇప్పుడు ప్రభాస్ సలార్ విషయంలో మాత్రం అంతకు మించి అనేలా ఆశపడుతోంది. ఏపీ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాతలు కూడా పోటీపడుతున్నారు. 

గీత ఆర్ట్స్ 170 కోట్ల వరకు ఆఫర్ చేయగా నిర్మత దిల్ రాజు ఏషియన్ సంస్థతో కలిసి 150 కోట్ల పెట్టుబడితో సలార్ హక్కుల సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక పీపుల్ మీడియా uv క్రియేషన్స్ కూడా దాదాపు 150 కోట్ల వరకు ఆఫర్ చేసింది. ఇక సురేష్ మూవీస్ అయితే 135 కోట్ల కంటే ఎక్కువగా ఈ సినిమాపై ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తిని చూపించడం లేదట. ఇక వీరిలో అయితే ముందుగా గీత ఆర్ట్స్ ఎక్కువ స్థాయిలో ఆఫర్ చేస్తుంది కాబట్టి వారికి రెండు రాష్ట్రాల తెలుగు హక్కులను ఇచ్చేందుకు సలార్ నిర్మాతలు చర్చిస్తున్నట్లు టాక్.

Post a Comment

Previous Post Next Post