సుకుమార్ చెప్పినా.. రిజెక్ట్ చేసిన శ్రీలీల?


సుకుమార్ సినిమాలో లేదా ఆయన శిష్యులు చేసే సినిమాల్లో అవకాశాలు వస్తే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి చాలామంది స్టార్స్ సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు టాప్ హీరోయిన్ కొనసాగుతున్న శ్రీ లీల మాత్రం ఒక ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న సెల్ఫిష్ సినిమాలో ఆశిష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సుక్కు శిష్యుడు కాశీ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఈ సినిమా కోసం మొదట శ్రీలీలను అనుకున్నారట. కథ బాగానే నచినప్పటికీ కూడా ఆమె ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే శ్రీ లీలా చాలా బిజీగా మారిపోయింది. మొదటి సినిమా పెళ్లి సందడి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవడంతో ఆ తర్వాత వచ్చిన ధమాకా ఏకంగా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 

అయితే ధమాకా కంటే ముందే శ్రీలీలకు సెల్ఫిష్ సినిమాలో ఆఫర్ చేశారట. ఆమె అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అని తన శిష్యుడు కాశీ విశాల్ కు కూడా సుకుమార్ సజెస్ట్ చేశాడు. కానీ శ్రీలీల అప్పటికే చాలా బిజీగా మారిపోయింది. ముందుగా ఒప్పుకున్న కమిట్మెంట్స్ తో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో సుకుమార్ సజెస్ట్ చేసిన ప్రాజెక్టును వదులుకోవాల్సి వచ్చిందట. అనంతరం దిల్ రాజు సలహా మేరకు లవ్ టుడే హీరోయిన్ ఇవానాను ఫిక్స్ చేశారు.

Post a Comment

Previous Post Next Post