రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇన్నాళ్లకు..!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎప్పటి నుంచో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే ప్రతీసారి కూడా ఏదో ఒక కారణం వలన అలాంటి ప్రాజెక్ట్స్ చర్చల దశ వరకు వచ్చి క్యాన్సిల్ అయ్యాయి. చాలా కాలం క్రితం తమిళ దర్శకుడు ధరణితో ఒక స్పోర్ట్స్ డ్రామా అనుకున్నాడు. ఆ సినిమాకు మెరుపు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసి లాంచ్ చేయగా మొదట్లోనే ప్రాజెక్ట్ ఆగిపోయింది. 

ఇక మరికొంత కాలం తరువాత చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా కాస్త స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథ అనుకున్నారు. అయినప్పటికీ స్క్రిప్ట్ పై పూర్తి స్థాయిలో నమ్మకంగా అనిపించకపోవడంతో చరణ్ డ్రాప్ అయ్యాడు. ఇక ఫైనల్ గా ఇన్నాళ్ళకు రామ్ చరణ్ ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్న స్పోర్ట్స్ కథను ఓకే చేశాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బౌండెడ్ స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది. ఇక సినిమా రెగ్యులర్ షూట్ ఈ ఏడాది చివరలో స్టార్ట్ కానుంది.

Post a Comment

Previous Post Next Post