మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ శంకర్ ఇండియన్ 2 తో బిజీ కావడం వలన ఈ సినిమా షూటింగ్ కు చాలా గ్యాప్ వచ్చింది. మరోవైపు చరణ్ కూడా కూతురు పుట్టడంతో ఫ్యామిలీ లైఫ్ తో కాస్త బిజీ అయ్యాడు.
అయితే ఇప్పుడు మొత్తానికి దర్శకుడు శంకర్ ఇండియా 2 సినిమాకు గ్యాప్ ఇచ్చే గేమ్ ఛేంజర్ సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన మరొక కొత్త షెడ్యూల్ ను ఈనెల 15వ తేదీన స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. దిల్ రాజు ప్లాన్ అయితే వేసుకున్నారు కానీ శంకర్ ఇంకా దానిపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రామ్ చరణ్ కూడా బిజీగా ఉన్నాడు. ఇక మిగతా ఆర్టిస్టుల డేట్స్ కూడా దొరకాలి. ఏదేమైనా కూడా సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలి అని దిల్ రాజు అనుకుంటున్నాడు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Follow
Post a Comment