త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల అల్లు అర్జున్ తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ అయితే ఇచ్చాడు గుంటూరు కారం సినిమా తర్వాత ఈ ప్రాజెక్టు ఉంటుంది అని తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ ఇచ్చిన మాట ప్రకారం అయితే ఈపాటికి మరో ఇద్దరు హీరోల సినిమాలు ఫినిష్ చేయాల్సి ఉంది. తనకు లైఫ్ ఇచ్చిన శ్రీ స్రవంతి ఫిలిమ్స్ కు చెందిన రామ్ పోతినేని తో త్రివిక్రమ్ తప్పనిసరిగా ఒక సినిమా చేయాల్సి ఉంది.
కానీ ఆ సినిమా ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక వెంకటేష్ తో కూడా మల్లీశ్వరి టైం నుంచి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఎందుకో మరి ఆ కాంబినేషన్ సెట్ కాలేదు ఇక వారి గురించి మధ్య మధ్యలో తప్పకుండా చేస్తానని చెప్పిన త్రివిక్రమ్ ఇప్పుడు హఠాత్తుగా అల్లు అర్జున్ తో బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనేసాడు. ఈ సినిమా ఫినిష్ అయితే త్రివిక్రమ్ రేంజ్ ఎక్కడికో వెళ్లడం కాయం. తేడా వస్తే మళ్ళీ ఆ హీరోల దగ్గరకు రావచ్చు కానీ బన్నీ ఉండగా త్రివిక్రమ్ కు ఫ్లాప్ రాకపోవచ్చు. ఇక ఆ హీరోలతో ఇప్పట్లో సినిమాలు చేయనట్లే అని అర్థమవుతుంది.
Follow
Post a Comment