బేబీ ప్రాఫిట్స్ కోట్లల్లో.. రెమ్యునరేషన్స్ లక్షల్లో..!అప్పట్లో టాక్సీవాలా సినిమాతో మరొకరితో భాగస్వామిగా చేసి నిర్మాత SKN భారీగానే పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ సినిమా అతనికి మంచి కలెక్షన్స్ అందించింది. అయితే మళ్లీ ఇన్నాళ్లకు బేబీ సినిమా ద్వారా నిర్మాత SKN ఊహించని స్థాయిలో ప్రాఫిట్స్ అందుకుంటున్నాడు. తప్పకుండా ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంటుంది అని అనిపిస్తుంది. ఇక 10 కోట్ల పెట్టుబడికి నిర్మాతకు దాదాపు 20 కోట్లకు పైగానే ప్రాఫిట్ రాబోతోంది.

అయితే ఈ స్థాయిలో లాభాలు అందుకున్న నిర్మాత SKN ఒక విధంగా ఇందులో నటించిన వారి కి చాలా తక్కువ పారితోషకాలు ఇచ్చాడు. కాకపోతే కంటెంట్ పరంగా ప్రొడక్షన్ కాస్ట్ అయితే చాలా ఎక్కువైందట. ఇక సినిమాలో మెయిన్ హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండకు 70 లక్షలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్యకు 50 లక్షల వరకు ఇచ్చారట. ఇక దర్శకుడు మాత్రమే కోటి రూపాయల వరకు అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా నటీనటులకు చాలావరకు 25 లక్షల కంటే తక్కువ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి సినిమా హిట్ అయిన సందర్భంగా నిర్మాత వారికి ఇంకా ఏదైనా కానుకలు ఇస్తాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post