లియో తెలుగు రేటు.. పెద్ద రిస్కే?


విజయ నటించిన లియో సినిమా తెలుగు హక్కులు సితార ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసేందుకు ఏషియన్ సినిమాస్ అలాగే దిల్ రాజు సురేష్ ప్రొడక్షన్స్ కూడా పోటీ పడ్డాయి. కానీ ఫైనల్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. నిజానికి గతంలో విజయ్ సినిమాలు తెలుగులో ఈ స్థాయిలో అయితే అమ్ముడుపోలేదు.

అతను నటించిన మాస్టర్ సినిమా థియేట్రికల్ హక్కులను 8 నుంచి 9 కోట్ల మధ్యలో సొంతం చేసుకోని మంచి లాభాలు అందుకున్నారు. కానీ ఆ తర్వాత బీస్ట్ సినిమాను దిల్ రాజు, ఏషియన్ సినిమాస్ సురేష్ ప్రొడక్షన్స్ ఇద్దరితో కలిసి అంతకంటే ఎక్కువ స్థాయిలో ఖర్చుపెట్టి కొనుగోలు చేశారు. కానీ ఆ సినిమా మాత్రం ఊహించని విధంగా నష్టాలు కలుగజేసింది.

ఇక ఇప్పుడు లియో కు లోకేష్ దర్శకుడు కావడంతో సితార గట్టిగానే పెట్టుబడి పెడుతోంది. క్లిక్ అయితే ఓకే కాని కంటెంట్ ఏ మాత్రం తేడా కొట్టిన కూడా సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ అవుతుంది. గత కొన్ని నెలలుగా చూసుకుంటే తమిళ హీరోలలో ఏ హీరో కూడా తెలుగులో అయితే 20 కోట్లకు పైగా ప్రాఫిట్స్ అంధించింది లేదు. ఈసారి విజయ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post