ఆడియెన్స్ మీద ఏడవడం కాదు.. శ్రీవిష్ణుని చూసి నేర్చుకోండి!


ఏదైనా సినిమా బాగోలేదు అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది చిత్ర యూనిట్ సభ్యులు స్పందిస్తున్న విధానం ఊహించని విధంగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని మీడియం రేంజ్ సినిమాలు అలాగే చిన్న సినిమాలు తీసిన వాళ్ళు మేము చాలా అద్భుతమైన కంటెంట్ కొత్త తరహా కంటెంట్ తీసామని చాలా హార్డ్ వర్క్ చేసాము అని చెబుతున్నారు. ఇక సినిమాపై ఆడియన్స్ నచ్చలేదు అని వారి అభిప్రాయం చెబితే చాలు ట్రోల్ చేస్తున్నారు అంటూ కావాలని ప్రెస్ మీట్ లు కూడా పెట్టేస్తున్నారు.

అయితే ఇటీవల శ్రీ విష్ణు మాత్రం ఎంతో నిజాయితీగా సినిమా విడుదల డేట్ కంటే ముందే ప్రీమియర్ షోలు ద్వారా మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకున్నాడు. మంచి కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తారు అని సామజవరగమన సినిమాతో మరోసారి రుజువు చేశారు. ఈ సినిమా కేవలం రెండు కోట్ల లెక్కలతో మొదలై ఇప్పుడు 25 కోట్లకు చేరుకుంది. రెండు వారాలు దాటినా కూడా ఆడియన్స్ ఇంకా చూస్తూనే ఉన్నారు అంటే కంటెంట్ ఎంతగా క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

రివ్యూలు బాగోలేదు కావాలని ట్రోల్ చేస్తున్నారు ఇలాంటి పదాలు సాకుతో కొంతమంది వారు తీసిన కళాఖండాలు చాలా గొప్పవి అని చెబుతున్నారు. అవసరం అయితే ప్రెస్ మీట్ లు పెట్టి మరి బాగోలేదు అన్న ఆడియన్స్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రివ్యూలు, ఎదుటి వాళ్ళ కామెంట్స్ చూసి సినిమా చూడకుండా ఉండకండి అంటున్నారు. సినిమా చూడాలి అనుకున్నప్పుడు నలుగురిని అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు. అసలు ఒక ఆడియన్ పెట్టే ఖర్చు అంతకంటే విలువైన సమయం చాలా గొప్పది.

కంటెంట్ బాగుంటే రేట్లు ఎంత పెరిగినా కూడా పట్టించుకోరు. పైరసీ వచ్చిన కూడా థియేటర్లలో వెళ్లి చూసేందుకు ఇష్టపడతారు. సినిమా నచ్చితే నలుగురికి వెళ్లి చెబుతున్నారు. అలాగే బాగోలేదు అంటే డబ్బు సమయం వృధా చేసుకోవద్దని కూడా అంటున్నారు.
ఇక సామజవరగమన మాత్రమే కాదు అంతకుముందు వచ్చినా బలగం సినిమా అలాగే ఎన్నో సినిమాలు కూడా కంటెంట్ ఉంటే స్టార్స్ కూడా అవసరం లేదు అని నిరూపించాయి. మరి అనవసరంగా ట్రోల్స్ చేస్తున్నారు, రివ్యూల వల్ల బలైపోతున్నాం, చాలా హార్డ్ వర్క్ చేశాము.. అనే వాళ్ళు ఆడియెన్స్ సమయం, డబ్బు కూడా అంతే విలువైనది అని ఆలోచిస్తే మంచిది.

Post a Comment

Previous Post Next Post