మరోసారి దెయ్యం కథతో నిఖిల్!


ఇటీవల స్పై సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకోవాలి అనుకున్న నిఖిల్ ఊహించిన విధంగా డిజాస్టర్ అయితే ఎదుర్కొన్నాడు. ఒక విధంగా ఆడియన్స్ లో ఈ హీరో నమ్మకాన్ని కూడా కొంత కోల్పోయాడు. సినిమాలో తప్పకుండా ఏదో కంటెంట్ ఉంటుంది అనుకుంటే సీక్రెట్ ను సీక్రెట్ లాగానే ఉంచాలి అని చెప్పిన వైనం చాలా చిరాకు తెప్పించింది. ఇక నిఖిల్ ఆ తర్వాత ఇన్ డైరెక్ట్ గా సినిమా రిజల్ట్ పై క్షమాపణలు కూడా చెప్పాడు. 

అయితే ఇప్పుడు తనకు హారర్ కథతో మంచి సక్సెస్ ఇచ్చిన విఐ ఆనంద్ తో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. వీఐ ఆనంద్ నిఖిల్ కాంబినేషన్లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా దెయ్యం కాన్సెప్ట్ లో వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నిఖిల్ మార్కెట్ను అప్పట్లోనే చాలా బాగా పెంచేసింది. ఇక ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడితో ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆనంద్ సందీప్ కిషన్ ఊరుపేరు బైరవకోన అనే సినిమా చేస్తున్నాడు.

Post a Comment

Previous Post Next Post