పుష్ప 2 సినిమా విషయంలో సుకుమార్ మామూలుగా ఆలోచించడం లేదు. ప్రతి సీన్ కూడా గ్రాండియర్ గా ఉండాలి అని ఈసారి ఎలాగైనా మార్కెట్ లో వెయ్యి కోట్ల మార్క్ ను అందుకోవానే చాలా బలంగా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సినిమా బిజినెస్ 700 కోట్ల రేంజ్ లో పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో బిగ్ సక్సెస్ అందుకోవాలని అల్లు అర్జున్ కూడా అనుకుంటున్నాడు.
అయితే ఈ సినిమాకు ఇప్పుడు వచ్చిన ఒక సమస్య చాలా హాట్ టాపిక్ గా మారుతుంది. సినిమాలో బన్నీతో పోటీపడే విధంగా ఒక బ్యూటీతో ఐటమ్ సాంగ్ చేయించాలి అని సుకుమార్ చాలా రోజులుగా చర్చలు అయితే జరుపుతున్నాడు. అయితే మైత్రి మూవీ మేకర్స్ శ్రీలీల కోసం బాగానే ప్రయత్నాలు చేసింది కానీ ఆమె చేయనని చెప్పేసింది.
ఇక మిగతా చాలా మంది గ్లామరస్ బ్యూటీలు సిద్ధంగానే ఉన్నప్పటికీ కొంతమంది రొటీన్ కాగా.. మరి కొంతమంది బన్నీ స్థాయికి తగ్గట్టుగా డాన్స్ మూమెంట్స్ అయితే ఇవ్వలేరు. కాబట్టి అందంగాను ఉండాలి.. కొత్తగాను ఉండాలి అలాగే గ్లామర్ డోస్ కూడా హై లెవెల్లో మ్యాచ్ చేయాలి, అన్నిటికీ మించి బన్నీకి పోటీ ఇచ్చేలా డ్యాన్స్ చేయాలి.. అని సుకుమార్ లెక్కలు వేసుకుంటున్నాడు. అందుకే స్పెషల్ సాంగ్ చేసే బ్యూటీ దొరకడం లేదు. మరి రాబోయే రోజుల్లో ఏ బ్యూటీ ని ఫిక్స్ చేస్తారో చూడాలి.
Follow
Follow
Post a Comment