జైలర్ కు భోళా అడ్వాంటేజ్?


తమిళ రీమేక్ మూవీ, శక్తి షాడో లాంటి డిజాస్టర్స్ అందుకున్న దర్శకుడు మెహర్ రమేష్, ఫామ్ లో లేని తమన్నా.. ఇలా భోళా శంకర్ ను చాలా రకాల బ్యాడ్ సెంటిమెంట్స్ అయితే తరుముతున్నాయి. సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది విడుదల తర్వాత కానీ తెలియదు. ప్రస్తుతం అయితే మెగా లవర్స్ లో తప్పితే మిగతా ఆడియన్స్ లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈ సినిమా ఫలితం ఏమాత్రం తేడా కొట్టిన కూడా అదే టైంలో విడుదలవుతున్న జైలర్ కు కాస్త కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది.

ఆ సినిమా కాస్త రొటీన్ కు భిన్నంగా తెరపైకి వచ్చినట్లుగా ట్రైలర్ ద్వారానే క్లారిటీ ఇచ్చారు. రజినీకాంత్ ఈసారి కాస్త డిఫరెంట్ త్రిల్లర్ పాయింట్ ను టచ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో భోళా శంకర్ కు రెగ్యులర్ రొటీన్ మాస్ కమర్షియల్ అనే టాక్ వస్తే మాత్రం జైలర్ వైపు ఆడియన్స్ ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ ఫైనల్ గా అయితే కంటెంట్ క్లిక్ అవ్వాలి. ఓపెనింగ్స్ విషయంలో జైలర్ పై భోళా శంకర్ కాస్త ప్రభావం చూపించినా కూడా ఆ తర్వాత కంటెంట్ బాగుంటే మాత్రం జైలర్ కు ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ పోటీలో ఏమవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post