మహేష్ - రాజమౌళి.. సైలెంట్ గా కానిచ్చేస్తున్నారా?


మహేష్ బాబు 29వ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే కథ హాలీవుడ్ రేంజ్ లో బిగ్ అడ్వెంచరస్ మూవీ గా ఉండబోతున్నట్లు ఇదివరకే ఒక హింట్ అయితే ఇచ్చేశారు. దాదాపు రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి కథను రాజమౌళి చేతిలో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక దాన్ని ఎలా వెండితెరపైకి తీసుకురావాలి అనేది పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తోనే రాజమౌళి సిద్ధం చేసుకుంటున్నాడు.

అయితే ఇప్పటికి స్క్రిప్ట్ పనులు కొంతవరకు పూర్తయ్యాయి. ఇక రాజమౌళి మిగిలిన స్క్రిప్ట్ మొత్తం కూడా సిద్ధం చేయడానికి కొంత గ్యాప్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా కథకు సంబంధించిన ఫీల్ తో ఉండాలి అని ఆయన వివిధ రకాల హాలిడే ట్రిప్స్ కైతే వెళ్తున్నారు. అంతేకాకుండా హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఆయన బాగానే చూస్తున్నారు. ఇక రీసెంట్గా నార్వే లో అత్యంత ఎత్తైన కొండలపై కూర్చుని కనిపించారు. 

అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ కోసమే అక్కడికి వెళ్లినట్లు చెప్పినప్పటికీ ఆయన బ్యాగ్రౌండ్ లో మాత్రం మహేష్ సినిమాకు సంబంధించిన ఆలోచనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరోవైపు రాజమౌళి స్క్రిప్ట్ అంటే తప్పకుండా బాడీ బిల్డింగ్ చేయాల్సిందే. కాబట్టి మహేష్ కూడా ముందుగానే వర్కౌట్స్ ఇంకాస్త గట్టిగానే అలవాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో కూడా ఫోటోలను కూడా షేర్ చేసుకున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం వీరిద్దరి ఆలోచన విధానాన్ని చూస్తూ ఉంటే అడుగులు అటువైపే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post