అనిరుధ్ దేవర.. ఫస్ట్ ఎలాంటి సాంగ్ అంటే..?


యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నాడు. ఇక జవాన్ సినిమాతో కూడా తనకి బాలీవుడ్లో మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక తెలుగులో తమిళంలో కూడా ఇప్పటికే అవకాశాలు పెరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం చేతిలో దాదాపు 8 ప్రాజెక్టులో ఉండడంతో కొత్తవాటికి ఓకే చేయడం లేదు. ముందు చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఫినిష్ అయిన తర్వాతనే మిగతా సినిమాలను ఒప్పుకోవాలని అనుకుంటున్నాడు.

ఇక ప్రస్తుతం అతని ఫోకస్ అయితే లియో, దేవర సినిమాలపైనే ఉంది. లియో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు సంబంధించిన పనులన్నీ కూడా దాదాపు ఫినిష్ అయ్యాయి. అలాగే మరోవైపు దేవర సినిమా కోసం ట్యూన్స్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా లీకైన సమాచారం ప్రకారం కొరటాల శివ మొదటి పాటను హీరో అలాగే అతని ప్రపంచం గురించి తెలిపే విధంగా పాటను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రామజోగయ్య శాస్త్రి ఆ పాటకు రచనను అందిస్తున్నారు. ట్యూన్ కూడా దాదాపు రెడీ అయిపోయింది. ప్రస్తుతం లిరిక్స్ విషయంలోనే ఇంకా కసరత్తులు చేస్తున్నారు. సినిమా కథకు సంబంధించి అంశాలు మొత్తం ఆ పాటలో హైలెట్ అవుతాయని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post