రాజమౌళి - మహేష్.. ఆ డేట్ పైనే అందరి ఫోకస్


మహేష్ బాబు రాజమౌళి తో చేయనున్న ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందా అని ఫాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు 29వ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ ప్రాజెక్టుపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఎందుకంటే ఇదివరకే రచయిత కే విజయేంద్ర ప్రసాద్ ఆ సినిమా RRR కంటే హై రేంజ్ లో ఉంటుంది అని తెలియజేశారు. అంతేకాకుండా అమెజాన్ అడవుల నేపథ్యంలో ఒక అడ్వెంచర్ మూవీగా ఉంటుంది అని కూడా అన్నారు.

ఇక తర్వాత ఆ పాత్రను హనుమాన్ క్యారెక్టర్ నుంచి స్ఫూర్తి పొందే డిజైన్ చేస్తున్నారని కూడా టాక్ వచ్చింది. ఇక గాసిప్స్ ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే ప్రస్తుతం అందరికి ఫోకస్ కూడా ఆగస్టు 9 పైన ఉంది. సాధారణంగా రాజమౌళి తన ప్రతి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను స్టార్స్ పుట్టినరోజు సందర్భంగానే విడుదల చేస్తూ ఉంటారు. ఇక ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి అప్డేట్ ఇస్తారు అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఏదైనా మోషన్ పోస్టర్ విడుదల చేస్తారా లేదా షూటింగ్ అప్డేట్ ఇస్తారా అనేది తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post