పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు సంబంధించిన ఫ్యూచర్ ప్రాజెక్టులపై కూడా ఇప్పుడే చాలా రకాల గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. ప్రభాస్ తో అయితే మైత్రి మూవీ మేకర్స్ సినిమా చేయడానికి ఎప్పుడో అడ్వాన్స్ కూడా ఇచ్చేసింది. అయితే మొదట బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో ప్రభాస్ ఆ డైరెక్టర్ చెప్పిన స్టోరీ లైన్ పై పెద్దగా ఆసక్తి చూపించలేదు.
ఇక మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ కోసం విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజును రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టులో హీరోయిన్ గా కూడా అనుష్కను అనుకుంటున్నట్లు అప్పుడే చాలా రకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వీలైనంతవరకు హిట్ కాంబినేషన్ నీ చాలా బలంగా నమ్ముతుంది.
ఇక ఈసారి ప్రభాస్ అనుష్కను కలపాలని చూస్తున్నారట. అయితే లోకేష్ మాత్రం ఇంకా కథను ఫైనల్ చేయలేదు. సాధారణంగా అతని సినిమాల్లో హీరోయిన్స్ క్యారెక్టర్స్ కు పెద్దగా స్కోప్ కూడా ఉండదు. మరి ప్రభాస్ అనుష్క అంటే తప్పకుండా అతను అనుష్కను బలమైన పాత్రలోనే చూపించాల్సి ఉంటుంది. మరి ఈ కాంబినేషన్ కు తగ్గ కథను లోకేష్ ఫైనల్ చేస్తాడో లేదో చూడాలి.
Follow
Follow
Post a Comment