భద్ర బ్యూటీ.. 40 ఏళ్ళ వయసులో లీడ్ రోల్?


భద్ర, గుడుంబా శంకర్ మూవీ ఫేమ్ మీరా జాస్మిన్ సినిమా ప్రపంచంలో ఊహించని విధంగా యూ టర్న్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.  ఆమె వివాహం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఘాటైన ఫొటోలతో స్టన్ అయ్యేలా చేసింది. ఇప్పుడు 40 ఏళ్ళ వయసులో తన కంటే రెండేళ్లు చిన్నవాడైన శ్రీవిష్ణు జోడిగా నటిస్తున్నట్లు టాక్ వస్తోంది.

రీతూ వర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘స్వాగ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న సెకండ్ రోల్ లో మీరా జాస్మిన్ నటిస్తుందని అంటున్నారు. ఇటీవల విడుదలైన 'విమానం'లో ఆమె చేసిన చిన్న పాత్ర వర్కవుట్ కాలేదు. కాబట్టి ఇది సరైన రీ ఎంట్రీ అవుతుందని అనిపిస్తోంది. చాలా మంది కథానాయికలు వెండితెరపైకి తిరిగి రావడం వలన వారి కెరీర్‌లో పెద్దగా మార్పులు ఏమి జరగలేదు, అయితే వారిలో కొందరు క్యారెక్టర్ రోల్స్‌లో క్లిక్ అయ్యారు.  అయినప్పటికీ, మీరా చాలా సాహసోపేతంగా ముందుకు వెళుతోంది. ఆమె తన కెరీర్‌ లో మళ్లీ ఒక డిఫరెంట్ లీడ్ రోల్స్ చేయాలని అనుకుంటున్నట్లు అనిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో.

Post a Comment

Previous Post Next Post