సునీల్ కు పెరుగుతున్న డిమాండ్.. రోజుకు ఎంతంటే?


ఒకప్పుడు కమెడియన్ గా సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపించిన సునీల్ ఆ తర్వాత హీరోగా మారి 3 సినిమాలతో పరవాలేదు అనే విధంగా సక్సెస్ అందుకున్నాడు. ఇక తర్వాత హీరోగా అతనికి వరుస డిజాస్టర్స్ ఎదురవడంతో మళ్ళీ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇక రీసెంట్గా జైలర్ సినిమాలో అతను చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. 

అయితే మొన్నటి వరకు తెలుగులోనే సినిమాలు చేసుకుంటూ వస్తున్న సునీల్ కు ఇప్పుడు తమిళంలో కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. జైలర్ చూసిన చాలామంది దర్శకులు సునీల్ డేట్స్ కోసం సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. జైలర్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో సునీల్ కూడా తన పారితోషకాన్ని పెంచినట్లుగా తెలుస్తోంది. రోజుకు 25 లక్షల రేంజ్ లో పారితోషకం తీసుకుంటూ వస్తున్న సునీల్ ఇప్పుడు ఏకంగా దాన్ని 35 లక్షలకు పెంచినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే విక్రమ్ నటించబోయే ఒక సినిమాలో కూడా సునీల్ కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే సన్ పిక్చర్స్ లో కూడా అతను మరొక సినిమా చేయనున్నట్లు టాక్.

Post a Comment

Previous Post Next Post