సలార్.. పాటలకు స్పేస్ ఎందుకు లేదంటే?


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమాలో సాంగ్స్ ఉండవు అనే చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఒక గట్టి టాక్ అయితే వినిపిస్తూ ఉంది. దర్శకుడు ప్రశాంత్ నిల్ మొదటి నుంచి కూడా యాక్షన్ ఎలివేషన్స తోనే తన సినిమాలను నిండా నింపేస్తాడు. కాబట్టి పెద్దగా అతను పాటలకు ఆసక్తి చూపడు అని కేజీఎఫ్ సినిమాతోనే అర్థం అయిపోయింది. కానీ వచ్చే రెండు సాంగ్స్ అయినా సరే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి అని నిరూపించాడు.

ఇక ఇప్పుడు సలార్ సినిమాలో కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నాడు. నిజానికి ఇందులో నాలుగు పాటలు ఉంచాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు కేవలం ఒక పాటకు మాత్రమే స్థానం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా కమర్షియల్ ఫార్మాట్లో ఉండకుండా ఉంటుందట. ఇక మరో రెండు బిట్ సాంగ్స్ మాత్రం ఉంటాయట. అవి కూడా కొన్ని సీన్స్ మధ్యలోనే వస్తాయి. సినిమా నిడివి ఎక్కువ కావడంతో దాదాపు 15 నిమిషాల వరకు తీసేయాలి అని గత రెండు మూడు నెలల నుంచి ప్రశాంత్ నీల్ గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. ఇక మొత్తంగా 4 పాటలు అనుకున్నప్పటికీ ఇప్పుడు ఒక సాంగ్ ను పూర్తిగా సినిమాలో నుంచి తీసేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా నిడివి 3 గంటల లోపే ఉండేలా ఎడిట్ చేస్తున్నట్లు టాక్.

Post a Comment

Previous Post Next Post