జవాన్ ప్రమోషన్స్.. నయన్ చేయకుంటే ఊరుకుంటారా?


నయనతార అదృష్టం ఏమిటో గాని సినిమా ప్రమోషన్స్ లో ఆమె పెద్దగా పాల్గొనకపోయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. తన పని తాను పూర్తి చేసుకుని షూటింగ్ అయిపోగానే సంబంధం లేదు అన్నట్లుగానే ఉంటుంది. ఈ విషయంలో ఆమెపై నిర్మాతలు కూడా పెద్దగా ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాలు లేవు. ఎందుకంటే ఆమెకున్న క్రేజ్ అలాంటిది. 

ఒక విధంగా పర్సనల్ రీజన్స్ వల్లనే ఆమె మీడియా ముందుకు వచ్చి ఏమీ మాట్లాడదు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే జవాన్ సినిమా విషయానికి వచ్చేసరికి నయనతార తన రూల్స్ బ్రేక్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది. షారుక్ ఖాన్ తో కలిసి ఆమె ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 9 కోట్ల రేంజ్ లో పారితోషకం తీసుకున్న నయనతార తన కెరీర్ కు ఇప్పటివరకు ఇది హైయెస్ట్ పేమెంట్ అని చెప్పవచ్చు. 

అయితే అందులోనూ జవాన్ సినిమా నిర్మాణంలో షారుక్ ఖాన్ భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె పాల్గొనాలని షరతుతోనే షూటింగ్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంటే మాత్రం భవిష్యత్తులో కూడా మరి కొంతమంది నిర్మాతలు అడగకుండా ఉండరు. మరి ఆమె నిజంగానే ప్రమోషన్ చేస్తుందా లేదా అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post