గేమ్ ఛేంజర్.. ఇక దిల్ రాజు చేసేదేమీ లేదు!


తమిళ దర్శకుడు శంకర్ తో సినిమా అంటే నిర్మాతలకు బడ్జెట్ లిమిట్స్ అనేవి అసలు ఏ మాత్రం ఉండవు. ఆ విషయం తెలిసే నిర్మాతలు ఆయనతో సినిమాలో చేసేందుకు ఆసక్తిని చూపిస్తారు. అయితే ఒకప్పుడు సక్సెస్ రేటు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం శంకర్ సినిమాలు అంచనాలకు తగ్గట్టుగా అయితే సక్సెస్ కావడం లేదు. ఇక గేమ్ చేంజర్ హై రేంజ్ లో ఉంటుంది అని నిర్మాత దిల్ రాజు శంకర్ ను గట్టిగానే నమ్మాడు.

దిల్ రాజు అన్ని లెక్కలు చూసుకునే ఏ దర్శకుడితో అయినా సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటాడు. ఇక శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమాను మొదట ప్రణాళికతోనే మొదలుపెట్టారు. బడ్జెట్ కూడా పెరగకుండా చూసుకున్నారు. కానీ శంకర ఆలోచన విధానం మళ్లీ ఎప్పటిలానే ఇక్కడ కూడా కొనసాగింది. దీంతో ఇప్పుడు షూటింగ్లో వేస్టేజ్ ఎక్కువగానే బయటపడుతున్నట్లు తెలుస్తోంది. 

శంకర్ పర్ఫెక్ట్ సీన్స్ కోసం రీషుట్స్ కూడా గట్టిగానే చేస్తున్నాడట. దీంతో దిల్ రాజు ప్రొడక్షన్ కాస్ట్ కూడా తడిసి మోపడు అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తి చేశారు కాబట్టి దిల్ రాజు కూడా అనడానికి ఏమీ లేదు. ఇక శంకర్ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తాడో కూడా తెలియదు. అందుకే ఆయన అప్డేట్స్ విషయంలో కూడా ఏమీ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక సినిమాను 2024 దసరాకే విడుదల చేయవచ్చు అని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post