OG: త్రివిక్రమ్ టచ్ ఉందా?


ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఏదో ఒక విషయంలో త్రివిక్రమ్ సలహా ఉంటుంది అని చాలా రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల థమన్ అయితే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వరుసగా మూడు సినిమాల ఆఫర్లు రావడానికి ముఖ్య కారణం త్రివిక్రమ్ గారు అని చెప్పడంతోనే అందరికీ ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఓ జి సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ టచ్ ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. 

అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని తెలుస్తోంది. నిర్మాత డివివి దానయ్య దర్శకుడు సుజిత్ త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఎంత మాత్రం లేకుండా ఈ సినిమా పనులను కొనసాగిస్తున్నారు. మొదట నిర్మాత దానయ్య డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను సంప్రదించి డేట్స్ తీసుకున్నాడు. ఇక సుజిత్ చెప్పిన కథ కూడా పవన్ ఎవరి సలహా తీసుకోకుండానే ఒప్పుకున్నాడు. ఇక ఈ ప్రాజెక్టు విషయంలో అయితే త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ కొంత కూడా లేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post