డబుల్ ఇస్మార్ట్.. సంజయ్ కు సాలీడ్ రెమ్యునరేషన్


డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ఈసారి ఎలాగైనా పూరి జగన్నాథ్ బాక్సాఫీస్ వద్ద బౌన్స్ బ్యాక్ అయ్యేలా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఈ సినిమా రిజల్ట్ రామ్ కు కూడా చాలా అవసరం అని చెప్పాలి. ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాను తెరపైకి తీసుకువస్తున్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నారు. 

ఇటీవల ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా జెట్ స్పీడ్ లోనే పూర్తి చేశారు. అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్ కూడా ఒక బిగ్ బుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఆయనకు పారితోషకం కూడా గట్టిగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 10 కోట్ల రేంజ్ లోనే సంజయ్ దత్తుకు జీతం ఇస్తున్నట్లు సమాచారం. 

ఇటీవల కాలంలో సంజయ్ దత్ కు సౌత్ ఇండియాలో ఆఫర్స్ గట్టిగానే పెరుగుతున్నాయి. ఇప్పటికే లియో సినిమాలో కూడా అతను ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. అయితే ఆ సినిమాకు కూడా సంజయ్ దత్ 10 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఒక విధంగా ఈ సీనియర్ నటుడు ఒకప్పుడు హీరో కంటే ఇప్పుడు విలన్ గానే ఎక్కువ స్థాయిలో ఆదాయం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post