పాన్ ఇండియా అప్పీల్‌తో ఇతర భాషల్లో సినిమాలను విడుదల చేసే ట్రెండ్ ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. చిత్రనిర్మాతలు దేశంలోని వివిధ ప్రాంతాలలో మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని పోస్టర్స్ నుంచి ట్రైలర్స్ వరకు బాగానే రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రతి నిర్మాణ బృందం డబ్బింగ్ ప్రక్రియపై అంతగా ఇంట్రెస్ట్ చూపించినట్లు అనిపించదు.
డబ్బింగ్ ప్రక్రియ కొన్నిసార్లు హాస్యాస్పదమైన పొరపాట్లకు దారితీస్తోంది. ఇటీవ ప్రభుదేవా చిత్రం "WOLF" టైటిల్ అందుకు ఉదాహరణగా నిలిచింది. ఏకంగా తెలుగు టైటిల్ "వుల్ఫా" అంటూ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ పొరపాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీయడమే కాకుండా, చిత్రనిర్మాతలకు కౌంటర్ ఇచ్చే విధంగా కౌంటర్లు వస్తున్నాయి.
AM రత్నం వంటి ప్రఖ్యాత చిత్రనిర్మాతలు విశాల్, సూర్య మరియు విక్రమ్ వంటి ప్రతిభావంతులైన నటులు కూడా తమ చిత్రాలను వివిధ భాషలలోకి డబ్ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. కానీ కొందరు కాస్త డబ్బు దగ్గర పిసినారి తనం చూపించి గూగుల్ లో అనువాదం చేస్తూ ఇలా తప్పులు చేస్తున్నారు. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ తప్పును ఎంత త్వరగా సరిదిద్దుకుంటుందో చూడాలి.
Follow
Follow
Post a Comment